సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు..!!
- January 05, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలు మోస్తరు నుండి భారీ వర్షంతో ప్రభావితమవుతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NMC) అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు రోజులపాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దాంతోపాటు గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
NMC నివేదిక ప్రకారం.. ఆది, సోమవారాల్లో తబుక్, మదీనా ప్రాంతాలలో.. అల్-జౌఫ్,ఉత్తర సరిహద్దులలో ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం వరకు.. హేల్, అల్-ఖాసిమ్ ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. సోమవారం నుండి బుధవారం వరకు రియాద్ ప్రాంతానికి విస్తరించి.. మంగళవారం, బుధవారం తూర్పు ప్రావిన్స్‌ను.. సోమవారం, మంగళవారం మక్కా ప్రాంతంలో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది.
NCM ప్రకారం.. తబుక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, హైల్ , ఖాసిమ్ ప్రాంతాలతో పాటు రియాద్ మరియు తూర్పు ప్రాంతాల ఉత్తర ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. జజాన్, అస్సేర్, అల్-బాహా , మక్కా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







