కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించిన కోర్టు
- January 07, 2025
తెలంగాణ హైకోర్టు లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగ్గా తుదితీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చింది. ఏసీబీ కేసును కొట్టివేయాలన్నకేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీంభవించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులనుసైతం ఎత్తివేసింది.
చట్టప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. కేటీఆర్ అరెస్ట్ పై స్టే నుకూడా హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్ నివాసంకు చేరుకొని తదుపరి కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ సోదాలు..
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. మాదాపూర్ లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో గ్రీన్ కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. 2022 అక్టోబరు 25న ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పంద జరిగింది. అంటే అంతకుముందే గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి రెండు దఫాలుగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 41కోట్ల రూపాయలు జమ చేయడంపై ఏసీబీ దృష్టిసారించింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
కేటీఆర్ అరెస్టు తప్పదా..?
హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ -కారు రేసు కేసులో మరింత దూకుడుగా ముందుకెళ్లనున్నారు. ఇవాళే కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి విచారణకు పిలుస్తారని సమాచారం. కేటీఆర్ ఈడీ విచారణకు ఇవాళే వెళ్లాల్సి ఉంది. కానీ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది.. తనకు విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఈడీ అధికారులను కేటీఆర్ కోరారు. దీంతో ఈడీ అధికారులు కేటీఆర్ విజ్ఞప్తికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఏసీబీతో పాటు ఈడీ అధికారులుసైతం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి రెండుమూడు రోజుల్లోనే విచారణకు రావాలని ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. విచారణ సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న వాదన ఉంది. అయితే, హైకోర్టు తీర్పు, తదనంతరం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







