ఉపాధ్యాయులు వారి కుటుంబాలకు వేసవి సెలవుల్లో బహ్రెయిన్ నుండి మరిన్ని విమానాలు
- June 28, 2016
మనామా : బహ్రెయిన్ అదనంగా మరిన్ని విమానాలు కైరోకు నడపనుంది. బహరేన్ విద్య మంత్రిత్వ శాఖలో 7626 మంది ఈజిప్టు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిని వేసవి సెలవులకు తమ స్వస్థలంకు నేరుగా పంపనున్నారు. బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహించే బహరేన్ విమానాశ్రయం కంపెనీ ద్వారా ఈ ప్రకటన చేయబడింది. ఈ విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకులు తమ నిష్క్రమణకు మూడు గంటల ముందే విమానాశ్రయానికి రావాల్సి ఉంది. అలాగే మాంసం లేదా చల్లబరిచిన లేదా ద్రవ పదార్ధాలని డబ్బాలలో తమ వెంట తీసుకురావడం అనుమతించారని తెలిపారు. వారికి చెందిన ప్రయాణ సామానులు ఒక రోజు ముందు విమానాశ్రయంకు తీసుకురావాలని సూచించారు. నాలుగు తనిఖీ కేంద్రాలని గల్ఫ్ ఎయిర్ మరియు ఈజిప్ట్ ఎయిర్ ప్రయాణికుల కోసం ఏర్పాటుచేశారు. ఇవి జూన్ 30 వ తేదీ రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జులై మూడవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







