భారతీయ పాఠశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్..!!
- January 08, 2025
మస్కట్: 2025-2026 విద్యా సంవత్సరానికి భారతీయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 20న ప్రారంభమవుతుంది. ఈ నమోదు ప్రక్రియ రాజధాని ప్రాంతంలోని ఏడు భారతీయ పాఠశాలలకు వర్తిస్తుంది. ఇందులో ఇండియన్ స్కూల్ బౌషర్, ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబీర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, ఇండియన్ స్కూల్ అల్ సీబ్, ఇండియన్ స్కూల్ అల్ మాబేలా ఉన్నాయి. అడ్మిషన్ ప్రక్రియ గురించి ఇండియన్ స్కూల్స్ ఒమన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ శివకుమార్ మాణికం మాట్లాడుతూ.. బోర్డు ప్రవేశపెట్టిన కేంద్రీకృత అడ్మిషన్ సిస్టమ్ అడ్మిషన్ ప్రక్రియను గణనీయంగా సులభతరం చేసిందన్నారు. పీక్ అడ్మిషన్ పీరియడ్లలో తల్లిదండ్రులకు తమ ఆన్లైన్ పోర్టల్ అడ్మిషన్ విధానాలు, అందుబాటులో ఉన్న ఖాళీలు, తరచుగా అడిగే ప్రశ్నల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబీర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా ఇంటర్నేషనల్ వింగ్స్ (కేంబ్రిడ్జ్ సిలబస్)లో ప్రవేశం కోరుకునే తల్లిదండ్రులు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ వీసాలతో భారతీయ పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తారు. పిల్లలు తప్పనిసరిగా ఏప్రిల్ 1 నాటికి మూడు సంవత్సరాలు పూర్తి అవ్వాలి. ఇండియన్ స్కూల్ మస్కట్ ఆవరణలో ఉన్న కేర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (CSE) సెంటర్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు నేరుగా CSE పరిపాలన కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా www.cseoman.com ని సందర్శించాలి.
ఒమన్‌లోని అన్ని భారతీయ పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం (NEP) అమలును ప్రకటించింది. NEP 2020 కింద అకాడెమిక్ స్ట్రక్చర్ 5+3+3+4 సిస్టమ్‌లోకి మార్పు చేశారు. ఇది సమగ్ర మరియు అభివృద్ధి విధానాన్ని నొక్కి చెబుతుంది. ఫౌండేషన్ స్టేజ్ ఇప్పుడు బాల్వటికా, కిండర్ గార్టెన్ I, కిండర్ గార్టెన్ IIతో కూడిన 3-సంవత్సరాల కిండర్ గార్టెన్ ప్రోగ్రామ్‌ను కలిగి ఉంది. దాని తర్వాత 1, 2 తరగతులు, 3 నుండి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందిస్తారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తల్లిదండ్రులను కోరారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన వివరణాత్మక సమాచారం www.indianschoolsoman.com లో అందుబాటులో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







