జహ్రాలో ఆగి ఉన్న పోలీసులను ఢీకొట్టిన కారు..!!

- January 09, 2025 , by Maagulf
జహ్రాలో ఆగి ఉన్న పోలీసులను ఢీకొట్టిన కారు..!!

కువైట్: జహ్రా ప్రాంతంలో జనరల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన పోలీసు పెట్రోలింగ్ కారును మరోకారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు పెట్రోలింగ్ కారు తీవ్రంగా ధ్వంసమైంది. మరో కారులో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాహనాన్ని నిలిపిన క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో కారులో ఉన్న పోలీసు అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు చెలరేగిన వాహనం కూడా దెబ్బతింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.  అతని ధ్వంసమైన కారు నుండి అతన్ని బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com