అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా బంద్ .

- June 29, 2016 , by Maagulf
అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా బంద్ .

అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా అఖిలపక్షం నేతృత్వంలో బుధవారం విజయవాడ నగరబంద్ కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటిని కాపాడటం కోసం గోశాలను తొలగిస్తున్నారంటూ ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గోశాలను భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని ప్రశ్నించిన గోశాల నిర్వహాకులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చితంగా తొలగిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com