లిజిమిలియా రోడ్‌లో 6 నెలలపాటు ట్రాఫిక్‌ డైవర్షన్‌

- June 29, 2016 , by Maagulf
లిజిమిలియా రోడ్‌లో 6 నెలలపాటు ట్రాఫిక్‌ డైవర్షన్‌

పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌, ఆరు నెలలపాటు లిజిమిలియా రోడ్‌లో డైవర్షన్‌ని ప్రకటించింది. కిలోమీటర్‌ మేర రోడ్డుకి సమాంతరంగా ఈ డైవర్షన్‌ రూట్‌ ఉంటుంది. ఒక్కో వైపు ఒక లైన్‌తో ఈ డైవర్షన్‌ని, తిరిగి లిజిమిలియా రోడ్డులో కలిసేదాకా ఏర్పాటు చేశారు. రోడ్డు వినియోగదారుల కోసం రోడ్‌ సైన్స్‌ని అష్గల్‌ డైవర్షన్‌ని గుర్తించేలా ఏర్పాటు చేసింది. స్పీడ్‌ లిమిట్‌ని గంటకు 50 కిలోమీటర్ల వేగానికే పరిమితం చేశామని, రోడ్డు వినియోగదారులంతా దీన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని అష్గల్‌ విజ్ఞప్తి చేస్తోంది. అల్‌ షీహానియా - లియాతూరియా - లిజిమిలియా ప్రాజెక్ట్‌లో భాగంగా ఇదే ఆఖరి డైవర్షన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com