అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా బంద్ .
- June 29, 2016
అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా అఖిలపక్షం నేతృత్వంలో బుధవారం విజయవాడ నగరబంద్ కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటిని కాపాడటం కోసం గోశాలను తొలగిస్తున్నారంటూ ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గోశాలను భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని ప్రశ్నించిన గోశాల నిర్వహాకులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చితంగా తొలగిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







