యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు
- January 09, 2025
హైదరాబాద్: ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కొత్త కోర్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. తాజాగా కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీవర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది.
సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు.. అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!







