జనవరి 12న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు: ఆర్టీఏ

- January 10, 2025 , by Maagulf
జనవరి 12న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు: ఆర్టీఏ

యూఏఈ: జనవరి 12న ఉదయం 8:00 గంటలకు బదులుగా దుబాయ్ మెట్రో ఉదయం 5:00 గంటలకే కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఆ రోజు జరగనున్న దుబాయ్ మారథాన్ ను పురస్కరించుకొని మెట్రో సమయాలను పొడిగిస్తున్నట్టు తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన మారథాన్ 24వ ఎడిషన్లో 42 కి.మీ. ఛాలెంజ్ కోసం వేలాది మంది తరలిరానున్నారు. ఇది దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరథాన్ ప్రారంభం, ముగింపు మదీనాత్ జుమైరా ఎదురుగా ఉన్న ఉమ్ సుకీమ్ రోడ్డులో ఉంటుంది. మూడు వేర్వేరు రేసులు 4 కి.మీ. ఫన్ రన్, 10 కి.మీ. పరుగు మరియు 42 కి.మీ. మారథాన్ నిర్వహిస్తున్నారు. 2013లో ప్రస్తుతం 34 ఏళ్ల ఇథియోపియన్, దుబాయ్ మారథాన్ను గెలుచుకున్నప్పుడు 2:04:45 వ్యక్తిగత బెస్ట్ను నమోదు చేశాడు. దుబాయ్ మారథాన్ అనేది 1998 నుండి ఎమిరేట్లో నిర్వహించబడుతున్న వార్షిక రోడ్ ఆధారిత మారథాన్ గా గుర్తింపు పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com