ఖతార్ వెదర్ అలెర్ట్..చల్లని గాలులు, పొగమంచు..!!

- January 10, 2025 , by Maagulf
ఖతార్ వెదర్ అలెర్ట్..చల్లని గాలులు, పొగమంచు..!!

దోహా: జనవరి 11వరకు ఖతార్ అంతటా అస్థిర వాతావరణ పరిస్థితులు ఉంటాయిని, వారంతంలో చల్లని గాలులు, పొగమంచు కురుస్తుందని ఖతార్ వాతావరణ శాఖ హెచ్చరించింది.  రాబోయే మూడు రోజుల వ్యవధిలో బలమైన గాలులు, సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉంటుందని,  ఉష్ణోగ్రతలు పడిపోతాయని అలెర్ట్ జారీ చేసింది.

జనవరి 10న పరిస్థితులు కొద్దిగా మెరుగుపడతాయని భావిస్తున్నారు. అయితే బలమైన గాలులు, ఆఫ్షోర్లో ఎత్తైన అలలు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు 14 - 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జనవరి 11 ఉదయం పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా ‘లో హారిజంటల్ విజిబిలిటీ” ఉంటుంది.  ఉష్ణోగ్రతలు - 23 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉంటాయి. పగటిపూట ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. సముద్రంలో అలల ఎత్తు 9 అడుగుల వరకు చేరుకుంటుంది. నివాసితులు, నావికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com