ఖతార్ వెదర్ అలెర్ట్..చల్లని గాలులు, పొగమంచు..!!
- January 10, 2025
దోహా: జనవరి 11వరకు ఖతార్ అంతటా అస్థిర వాతావరణ పరిస్థితులు ఉంటాయిని, వారంతంలో చల్లని గాలులు, పొగమంచు కురుస్తుందని ఖతార్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల వ్యవధిలో బలమైన గాలులు, సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు పడిపోతాయని అలెర్ట్ జారీ చేసింది.
జనవరి 10న పరిస్థితులు కొద్దిగా మెరుగుపడతాయని భావిస్తున్నారు. అయితే బలమైన గాలులు, ఆఫ్‌షోర్‌లో ఎత్తైన అలలు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు 14 - 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జనవరి 11 ఉదయం పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా ‘లో హారిజంటల్ విజిబిలిటీ” ఉంటుంది. ఉష్ణోగ్రతలు - 23 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉంటాయి. పగటిపూట ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. సముద్రంలో అలల ఎత్తు 9 అడుగుల వరకు చేరుకుంటుంది. నివాసితులు, నావికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!







