వర్షంలో ప్రమాదకరమైన విన్యాసాలు..డ్రైవర్‌కు Dh50,000 జరిమానా..!!
- January 11, 2025
యూఏఈ: దుబాయ్‌లో ఇటీవల వర్షంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గస్తీ బృందాలు వెంటనే అతడిని గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను దుబాయ్ పోలీసులు షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ చట్టాలను పాటించాలని పదేపదే హెచ్చరించినప్పటికీ ఈ సంఘటన జరిగిందని దుబాయ్ పోలీసులు తెలిపారు.
దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ బృందం వెంటనే వాహనాన్ని వెంబడించి డ్రైవర్‌కు Dh50,000 జరిమానా విధించిందని దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి అన్నారు. డ్రైవర్లందరూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేగ పరిమితులకు కట్టుబడి ఉండాలని, ప్రాణాలను ప్రమాదంలో పడేసే చర్యలను నివారించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







