సీజనల్ ఫ్లూ నుండి రక్షణకు వ్యాక్సిన్..70% వరకు రక్షణ..!!

- January 11, 2025 , by Maagulf
సీజనల్ ఫ్లూ నుండి రక్షణకు వ్యాక్సిన్..70% వరకు రక్షణ..!!

దోహా: సీజనల్ ఫ్లూ నుండి రక్షణకు వీలైనంత త్వరగా తమ ఫ్లూ వ్యాక్సిన్‌ను పొందాలని కమ్యూనిటీని హమద్ జనరల్ హాస్పిటల్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ పేషెంట్ అండ్ ఫ్యామిలీ అడ్వైజరీ కౌన్సిల్ కోరింది. ఫ్లూ సీజన్ ప్రారంభంతో నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. వైరస్ నుండి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ అనేది ఉన్నవాటిలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటని తెలిపింది. సీజనల్ ఇన్ఫ్లుఎంజా ప్రభావాన్ని తగ్గించడంలో వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని, ఇది 70% వరకు రక్షణను అందిస్తుందని వెల్లడించింది.    

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఫ్లూ బారిన పడుతున్నారు. వందల వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఫ్లూ సంబంధిత సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క ఖతార్‌లోనే 2022లో ఇన్‌ఫ్లుఎంజా కారణంగా 750 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ముఖ్యంగా  గర్భిణీ స్త్రీలు, పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, 50 ఏళ్లు పైబడిన వారికి అత్యధిక హాని ఉందని, వారందరూ తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. వ్యాక్సినేషన్ వ్యక్తిగత రక్షణ గురించి మాత్రమే కాకుండా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.  

31 ఆరోగ్య కేంద్రాలు, హమద్ మెడికల్ కార్పొరేషన్‌లోని ఔట్ పేషెంట్ క్లినిక్‌లు, 45 సెమీ-గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ క్లినిక్‌లతో సహా ఖతార్ అంతటా 90 ఆరోగ్య సదుపాయాలలో ఫ్లూ వ్యాక్సిన్‌లు ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com