ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన యూఏఈ పాస్‌పోర్ట్..!!
- January 11, 2025
యూఏఈ: ప్రపంచంలో బలమైన పాస్ పోర్టులు కలిగిన ఉన్న దేశాల్లో యూఏఈ ఒకటిగా మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది. హెన్లీ & పార్ట్‌నర్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ ప్రకారం.. యూఏఈ పాస్‌పోర్ట్ 2025లో, 185 దేశాలకు వీసా-రహిత యాక్సెస్, వీసా-ఆన్-అరైవల్‌తో ప్రపంచంలోని 10 బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. గత సంవత్సరం కంటే ఒక స్థానం మెరుగుపడింది. 2022-2023లో 15వ స్థానం నుండి 2024లో 11వ స్థానానికి, 2025లో 10వ స్థానానికి చేరుకుంది. 2017లో 38వ స్థానంలో ఉన్న ర్యాంకింగ్ 21వ స్థానానికి చేరుకోవడంతో 2018లో దేశం అతిపెద్ద మెరుగుదలను నమోదు చేసింది. యూఏఈతోపాటు 10వ స్థానంలో లాత్వియా, లిథువేనియా, స్లోవేనియా కూడా ఉన్నాయి.
యూఏఈ పాస్‌పోర్ట్ తో వీసా రహితంగా వెళ్లగల కొన్ని ముఖ్యమైన దేశాలు: కెనడా, చైనా, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, జపాన్, మాల్దీవులు, మారిషస్, మొరాకో, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీయే, యూకే.
ఇతర గల్ఫ్ దేశాలలో ఖతార్ 47వ స్థానంలో, కువైట్ 50వ స్థానంలో, బహ్రెయిన్, సౌదీ అరేబియా 58వ స్థానంలో నిలవగా, ఒమన్ 59వ స్థానంలో ఉన్నాయి.
హెన్లీ & పార్టనర్స్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (IATA) అందించిన డేటా ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. ఇండెక్స్‌లో 199 దేశాల పాస్‌పోర్ట్‌లు, 227 విభిన్న ప్రయాణ గమ్యస్థానాల వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 195 వీసా రహిత గమ్యస్థానాలతో సింగపూర్ పాస్‌పోర్ట్ మెరుగైన స్థానంలో ఉంది. 2024లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ , స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు కూడా మెరుగైన ర్యాంక్‌లో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అవన్నీ మొదటి స్థానాన్ని కోల్పోయాయి. 2025లో జపాన్ రెండవ స్థానంలో ఉండగా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ 192 వీసా రహిత గమ్యస్థానాలతో 3వ స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







