చైనా మాంజా విక్రయించినా..వినియోగించినా చట్టపరమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు
- January 13, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా వినియోగించినా వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.రాచకొండ పరిధిలో (మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో) ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు 56 వేల మీటర్ల మాంజా సీజ్ చేయడం జరిగింది నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలు మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యావరణానికి విపత్తుగా మారుతొంది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగం పట్ల దూరంగా వుంటూ ఎవరికీ హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







