'పెద్ద'- ఫస్ట్ లుక్
- January 14, 2025
వైభవ్, సునీల్ లీడ్ రోల్స్ లో ఇళంగో రామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, బవేజ స్టూడియోస్ సమర్పణలో ఎస్ కార్తికేయన్, హర్మాన్ బవేజ, పి. హిరణ్య నిర్మిస్తున్నారు. శశి నాగ్ సహా నిర్మాత.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ద' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు.
"ఫన్ ఫ్యామిలీ ఫ్యూనరల్" అనే ట్యాగ్ తో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మరణించిన కుటుంబ పెద్ద చూట్టూ గుమిగూడిన కుటుంబం, వారి డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, దీపా శంకర్, బాల శరవన్ కీలక పాత్ర పోహిస్తున్నారు.
ఈ చిత్రానికి అరుణ్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సత్య తిలకం డీవోపీ, సూర్య కుమారగురు ఎడిటర్.
నటీనటులు: వైభవ్, సునీల్, రెడిన్ కింగ్స్లీ, దీపా శంకర్, బాల శరవన్
దర్శకత్వం:ఇళంగో రామ్
నిర్మాతలు: ఎస్ కార్తికేయన్, హర్మాన్ బవేజ, పి. హిరణ్య
బ్యానర్స్: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, బవేజ స్టూడియోస్
సహా నిర్మాత: శశి నాగ్
మ్యూజిక్: అరుణ్ రాజ్
డీవోపీ: సత్య తిలకం
ఎడిటర్: సూర్య కుమారగురు
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







