లండన్ ఈయూ నుంచి బయటకు వెళ్లాలనుకోవడం లేదని కెర్రీ
- June 29, 2016
యురోపియన్ యూనియన్‌తో విడిపోవాల్సిందేనని బ్రిటన్ ప్రజలు విస్పష్టంగా తీర్పు చెప్పినా ఓ అమెరికా పెద్దాయన మాత్రం అది జరిగే పని కాదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనేమీ సాధారణ వ్యక్తి కాదు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి జాన్ కెర్రీ. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే అంశంపై ఈయూతో ఎలా సంప్రదింపులు జరుపాలని కామెరాన్ తనతో అన్నట్లు కెర్రీ వెల్లడించారు. ఈ విడాకుల ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 50 ప్రక్రియ మొదలుపెట్టడానికి కామెరాన్ ఏమాత్రం ఇష్టపడటం లేదని ఆయన చెప్పారు. లండన్ ఈయూ నుంచి బయటకు వెళ్లాలనుకోవడం లేదని కెర్రీ వివరించారు. ఇష్టం లేని పని ఎలా చేయాలో కామెరాన్‌కు అర్థం కావడం లేదని, అలాగే బ్రెగ్జిట్‌ను కోరుకున్నవారికి కూడా ఇది అంతుబట్టడం లేదని ఆయన అన్నారు. కామెరాన్ స్థానంలో ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్న బోరిస్ జాన్సన్‌ను ఉద్దేశించి కెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి బ్రెగ్జిట్‌పై బ్రిటన్ వెనకడుగు వేస్తుందా, వేస్తే ఎలా అని కెర్రీని ప్రశ్నించగా.. దానికి అనేక మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓ దేశ విదేశాంగ మంత్రిగా తాను ఆ విషయాలను వెల్లడించలేనని చెప్పారు. నిజానికి బ్రెగ్జిట్‌ను అమెరికా కూడా కోరుకోలేదు. అది తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో లండన్, ఈయూ మధ్య సత్సంబంధాలు ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది అగ్రరాజ్యం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







