గాజా కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- January 16, 2025
రియాద్: గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఒప్పందాన్ని సులభతరం చేయడంలో ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు ముగింపు పలకాలని, గాజా స్ట్రిప్ తోసహా అన్ని పాలస్తీనా, అరబ్ భూభాగాల నుండి ఇజ్రాయెల్ తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది. పాలస్తీనా ప్రజల హక్కులకు, ప్రత్యేకించి తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే వారి హక్కుకు ఇది మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 45వేలమందికి పైగా మరణించగా, 100,000 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







