స్లాటర్‌ హౌస్‌లను వినియోగించాలి: మునిసిపాలిటీ

- June 29, 2016 , by Maagulf
స్లాటర్‌ హౌస్‌లను వినియోగించాలి: మునిసిపాలిటీ

మునిసిపల్‌ అథాఇటీస్‌, రెసిడెంట్స్‌కి స్లాటర్‌ హౌస్‌ల వినియోగంపై అప్పీల్‌ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో జంతువుల్ని వధించడం మానాలనీ, లేదంటే ఆ చర్యల కారణంగా అబుదాబీ సిటీ ఇమేజ్‌కి చెడ్డపేరు వస్తుందనీ, వ్యర్థాల కారణంగా పరిసరాలు కలుషితమవుతాయని అధికారులు హెచ్చరించారు. హెచ్చరికల్ని లెక్కచేయనివారికి 500 దిర్హామ్‌ల జరీమానా విధించబడుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. అబుదాబీ స్లాటర్‌ హౌస్‌లలో ఈ రమదాన్‌ సందర్భంగా 75,000 జంతువులను ప్రాసెస్‌ చేస్తారు. గతంతో పోల్చితే ప్రస్తుతం 15.5 శాతం అధికంగా ఈ సంఖ్య ఉండవచ్చునని అంచనా. అబుదాబీ పబ్లిక్‌ స్లాటర్‌ హౌస్‌, బనియాస్‌ స్లాటర్‌ హౌస్‌, అల్‌ వత్‌బా స్లాటర్‌హౌస్‌తోపాటు, అదనపు ఏర్పాట్లు కూడా చేస్తున్నామనీ, రెసిడెంట్స్‌ వీటిని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆయా జంతువుల్ని బట్టి 15 దిర్హామ్‌ల నుంచి 60 దిర్హామ్‌లదాకా స్లాటర్‌ హౌస్‌లలో ఛార్జ్‌ చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com