ఒమన్‌లో కొత్త బోర్డు సభ్యుల ఎన్నుకున్న ఇండియన్ స్కూల్స్..!!
- January 19, 2025
మస్కట్: ఒమన్‌లోని భారతీయ పాఠశాలలు కొత్త నాయకత్వ బృందాన్ని ఎన్నుకున్నాయి. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BoD)లో పనిచేయడానికి పేరెంట్స్ ఐదుగురు కొత్త సభ్యులకు ఓటు వేశారు. దేశవ్యాప్తంగా 21 భారతీయ పాఠశాలల్లో చదువుతున్న 46వేల మంది విద్యార్థుల భవిష్యత్తును కొత్త సభ్యులు రూపొందించనున్నారు.
కొత్తగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు షమీర్ పి.టి.కె (597 ఓట్లు), దామోదర్ ఆర్ కత్తి (550 ఓట్లు), సయ్యద్ అహ్మద్ సల్మాన్ (496 ఓట్లు), కృష్ణేందు ఎస్ (440 ఓట్లు), నిధీష్ కుమార్ పిపి (430 ఓట్లు) వచ్చాయి. బోర్డులో ఉన్న ఐదు స్థానాలకు మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
కొత్తగా ఎన్నికైన వారిలో దామోదర్ ఆర్ కత్తి బోర్డులో సేవలందించే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "మా విద్యార్థుల అవసరాలు, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, మా పాఠశాలల నిరంతర వృద్ధి మరియు విజయాన్ని నిర్ధారించడానికి ఇతర బోర్డు సభ్యులతో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నాను." అని తెలిపారు. కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు ఇప్పుడు ఒమన్‌లోని పెద్ద భారతీయ పాఠశాలల విధానాలను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టనున్నారు. 1 ఏప్రిల్ 1న కొత్త బోర్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







