‘ఐడెంటిటీ’ ట్రైలర్ రిలీజ్..
- January 20, 2025
టోవినో థామస్, త్రిష మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళ సినిమా ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన, దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది.జనవరి 2న మలయాళంలో రిలీజయి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే మలయాళంలో 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. వినయ్ రాయ్, మందిర బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఐడెంటిటీ సినిమా ఇప్పుడు తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.
తాజాగా నేడు ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాతలతో పాటు డైరెక్టర్, వినయ్ రాయి పాల్గొన్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నట్టు ఉంది. ఏదో సంఘటనను చూసిన వ్యక్తి – ఓ స్కెచ్ ఆర్టిస్ట్ – ఓ పోలీస్ ఆఫీసర్ – ఓ విలన్ మధ్యలో జరిగే కథలా తెలుస్తుంది. ఫ్లైట్ లో యాక్షన్స్ సీన్స్ చాలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి విడుదల చేద్దాం అనుకున్నా ఇక్కడ సినిమాలు ఉన్నాయి కాబట్టి 24వ తేదీన రిలీజ్ చేస్తున్నాము. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది.అనుకోని కారణాల వల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ ఈవెంట్ కి రాలేకపోయారు అని తెలిపారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. హిట్ సినిమా ఐడెంటిటీని మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించిన చాలా మంది తెలుగు వారికి పరిచయమే. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!