గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- January 21, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మళ్లీ మొదలుపెట్టిన ప్రజా పాలన దరఖాస్తులలో భాగంగా నేటి నుండి గ్రామ సభలు ప్రారంభం అయ్యాయి.రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.ఈ సభలలోనే నాలుగు పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.ఈ సందర్భంగా మహేశ్వరం జోన్ పరిధిలోని రావిరాల, జల్పల్లి లేమూరు గ్రామసభల సమావేశాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గ్రామ సభలలో పాల్గొనే ప్రజలకు,దరఖాస్తులు పెట్టుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు డిసిపి సునీత రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు .
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







