తెలంగాణ గవర్నర్ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్..
- January 21, 2025
హైదరాబాద్: వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు జాబితాను వెల్లడించింది. కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం యేటా ప్రదానం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను అందిస్తారు. గత ఐదేళ్లుగా ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారని అన్నారు. ఈ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు, జ్ఞాపిక ఇస్తారు.
అవార్డుకు ఎంపికైన వ్యక్తులు, సంస్థలు ఇవే
దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు – పిబి కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు ప్రధానం చేస్తారు. ఇక సంస్థల విషయానికొస్తే.. ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్.. నాలుగు సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







