అబుదాబిలో రెండు పరిశ్రమలపై చర్యలు..కార్యాకలాపాలు సస్పెండ్..!!

- January 24, 2025 , by Maagulf
అబుదాబిలో రెండు పరిశ్రమలపై చర్యలు..కార్యాకలాపాలు సస్పెండ్..!!

యూఏఈ: అబుదాబిలోని రెండు పారిశ్రామిక సౌకర్యాలలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు.  ప్రజారోగ్యం,  పర్యావరణాన్ని రక్షించడానికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నట్లు పర్యావరణ ఏజెన్సీ - అబుదాబి X లో తెలిపింది. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందున వారిలో ఒకదానికి జరిమానా విధించారు.  అథారిటీ రెగ్యులర్ తనిఖీల సందర్భంగా.. గాలి నాణ్యత పర్యవేక్షణ నివేదికలలో పేర్కొన్న కాలుష్య స్థాయిలు అనుమతించబడిన పరిమితులను మించిపోయాయని వెల్లడించాయి.  ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, ప్రకృతిని కాపాడేందుకు అన్ని పారిశ్రామిక సౌకర్యాలు పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో సమన్వయం, సహకారంతో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com