ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్‌ రద్దుతో 14 విమానాలు మళ్లింపు..!!

- January 25, 2025 , by Maagulf
ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్‌ రద్దుతో 14 విమానాలు మళ్లింపు..!!

దుబాయ్: హర్గీసా అంతర్జాతీయ విమానాశ్రయం (HGA)కి వెళ్లే ఫ్లైదుబాయ్ విమానం శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నుండి టేకాఫ్‌ను చివరినిమిషంలో రద్దు చేశారు. దీని వలన యూఏఈలోని సమీప విమానాశ్రయాలకు 14 ఇన్‌బౌండ్ విమానాలను మళ్లించాల్సి వచ్చింది.  విమానం ఆలస్యానికి కారణం తెలియరాలేదు.కానీ దుబాయ్‌కి చెందిన క్యారియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ప్రత్యామ్నాయ విమానంలో వారి ప్రయాణాన్ని కొనసాగించారని తెలిపారు.ప్రయాణికుల భద్రతకే తమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. "ప్రయాణికుల ప్రయాణ షెడ్యూల్‌కు జరిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము" అని ఎయిర్‌లైన్ తెలిపింది. టేకాఫ్ రద్దుతో 14 ఇన్‌బౌండ్ విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. “శుక్రవారం ఉదయం ఫ్లైదుబాయ్ ఫ్లైట్ (FZ661) టేకాఫ్ సస్పెండ్ కారణంగా షెడ్యూల్ కు అంతరాయం కలిగింది. అయితే, కొద్ది సమయంలోనే DXB సాధారణ కార్యకలాపాలకు తిరిగి వచ్చింది." అని DXB తన ప్రకటనలో తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com