సౌదీ చరిత్ర పరిరక్షణ..రియాద్‌లో 'నేషనల్ హిస్టరీ ల్యాబ్' ప్రారంభం..!!

- January 27, 2025 , by Maagulf
సౌదీ చరిత్ర పరిరక్షణ..రియాద్‌లో \'నేషనల్ హిస్టరీ ల్యాబ్\' ప్రారంభం..!!

రియాద్: రియాద్‌లోని ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్‌రహ్మాన్ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ సెంటర్‌లో “నేషనల్ హిస్టరీ ల్యాబ్” కార్యకలాపాలను కింగ్ అబ్దుల్ అజీజ్ ఫౌండేషన్ (దారా) సీఈఓ టర్కీ అల్-షువైర్ ప్రారంభించారు. 30 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు ,  15 జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నాయి.  ఇది జనవరి 28వరకు జరుగనుంది. సౌదీ అరేబియా విజన్ 2030కి అనుగుణంగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి జాతీయ చరిత్రను సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, ప్రచురించడంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ ల్యాబ్ లక్ష్యం. "నేషనల్ హిస్టరీ ల్యాబ్" సౌదీ అరేబియా సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం, దానిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం అనేక వినూత్న ఆధునాతనమైన పరిష్కారాలను రూపొందించేందుకు కృషి చేస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com