దుబాయ్‌లో 2024లో 57% పచ్చదనం పెరుగుదల..!!
- January 28, 2025
దుబాయ్: 2024లో దుబాయ్ అంతటా 216,500 చెట్లను నాటారు. 2023తో పోలిస్తే ఇది 17 శాతం అధికం కావడం గమనార్హం. ఇది గత ఏడాది సగటున ప్రతిరోజూ 600 చెట్లను నాటినట్లు దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది. ఎమిరేట్ పచ్చని ప్రదేశాలు కూడా 391.5 హెక్టార్లకు విస్తరించాయని, 2023 నుండి 57 శాతం వృద్ధి నమోదు అయినట్లు వెల్లడించారు. విస్తృత హరితీకరణ కార్యక్రమాలలో భాగంగా 5.3 మిలియన్ల పువ్వులు, అలంకారమైన మొక్కలను నాటినట్టు దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది. దుబాయ్ మునిసిపాలిటీ నాటిన విభిన్న రకాల చెట్లలో ఘఫ్, సిద్ర్, సమర్ వంటి దేశీయ జాతులతోపాటు వేప, ఆలివ్, ఇండియన్ జాస్మిన్, వివిధ తాటి రకాలు వంటి అలంకారమైన చెట్లు ఉన్నాయి.
దుబాయ్ గ్రీన్ ప్రాజెక్ట్ కింద, నివాస పట్టణ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెన కూడళ్లు, పబ్లిక్ పార్కులు, వినోద సౌకర్యాలతె 165 సుందరీకరణ ప్రాజెక్టులను అమలు చేసినట్టు దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ ఫెసిలిటీస్ ఏజెన్సీ సీఈఓ బదర్ అన్వాహి తెలిపారు.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









