దుబాయ్‌లో 2024లో 57% పచ్చదనం పెరుగుదల..!!

- January 28, 2025 , by Maagulf
దుబాయ్‌లో 2024లో 57% పచ్చదనం పెరుగుదల..!!

దుబాయ్: 2024లో దుబాయ్ అంతటా 216,500 చెట్లను నాటారు. 2023తో పోలిస్తే ఇది 17 శాతం అధికం కావడం గమనార్హం.  ఇది గత ఏడాది సగటున ప్రతిరోజూ 600 చెట్లను నాటినట్లు దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది. ఎమిరేట్ పచ్చని ప్రదేశాలు కూడా 391.5 హెక్టార్లకు విస్తరించాయని, 2023 నుండి 57 శాతం వృద్ధి నమోదు అయినట్లు వెల్లడించారు.  విస్తృత హరితీకరణ కార్యక్రమాలలో భాగంగా 5.3 మిలియన్ల పువ్వులు, అలంకారమైన మొక్కలను నాటినట్టు దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది. దుబాయ్ మునిసిపాలిటీ నాటిన విభిన్న రకాల చెట్లలో ఘఫ్, సిద్ర్, సమర్ వంటి దేశీయ జాతులతోపాటు వేప, ఆలివ్, ఇండియన్ జాస్మిన్, వివిధ తాటి రకాలు వంటి అలంకారమైన చెట్లు ఉన్నాయి.  

దుబాయ్ గ్రీన్ ప్రాజెక్ట్ కింద, నివాస పట్టణ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెన కూడళ్లు, పబ్లిక్ పార్కులు, వినోద సౌకర్యాలతె 165 సుందరీకరణ ప్రాజెక్టులను అమలు చేసినట్టు దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ ఫెసిలిటీస్ ఏజెన్సీ సీఈఓ బదర్ అన్వాహి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com