కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది భారతీయులు మృతి
- June 30, 2016
గల్ఫ్ దేశమైన కువైట్‌లో ఓ పాత భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదురుగు పరిస్థితి విషమంగా ఉందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. గత వారం గల్ఫ్‌లోని సెంట్రల్ జైలులో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







