ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!

- February 02, 2025 , by Maagulf
ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!

మస్కట్: ఒమన్ లో జరిగిన తూర్పు మధ్యధరా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ 21వ ప్రాంతీయ సమావేశంలో 18 దేశాల నుండి 450 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థుల పాల్గొన్నారు. ఒమన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (మెడ్‌స్కో) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్‌పర్సన్ హింద్ బింట్ యూసఫ్ అల్ బలూషి మాట్లాడుతూ.. ప్రాంతీయ,  ప్రపంచ స్థాయిలలో వైద్య రంగంలో ప్రముఖ గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు.  ఇది ఆరోగ్య రంగంలో కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై అవగాహన కల్పించిందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com