సౌదీ అరేబియాలో 40% తగ్గిన అకాల మరణాల రేటు..!!
- February 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలో 2017 సంవత్సరం నుండి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అకాల మరణాల రేటు 40 శాతం తగ్గిందని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ తెలిపారు. ఈ మేరకు రియాద్‌లో హెల్త్ హోల్డింగ్ కంపెనీ నిర్వహించిన మోడల్ ఆఫ్ హెల్త్‌కేర్ ఫోరమ్ లో ఆయన తెలిపారు. 2017 నుండి రోడ్డు ప్రమాదాల మరణాల రేటు 50 శాతానికి పైగా తగ్గిందని పేర్కొన్నారు. మానవ ఆరోగ్యానికి మొదటి స్థానం కల్పించే సమగ్ర దృష్టిని రూపొందించినందుకు సౌదీ నాయకత్వానికి అల్-జలాజెల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి ప్రపంచంలో 10 మిలియన్ల మంది ఆరోగ్య ప్రాక్టిషనర్ల అంతరం ఉందని ధృవీకరించగా, సౌదీ అరేబియా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అత్యుత్తమ నైపుణ్యాన్ని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. సౌదీలో అమలు చేస్తున్న హెల్త్ ప్రాజెక్టులు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని వివరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







