దుబాయ్‌లో ఇండి vs పాకిస్థాన్: విమాన ఛార్జీలు 50% పెరుగుదల..!!

- February 02, 2025 , by Maagulf
దుబాయ్‌లో ఇండి vs పాకిస్థాన్: విమాన ఛార్జీలు 50% పెరుగుదల..!!

యూఏఈ: ఫిబ్రవరి 23న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం సమీపిస్తున్న నేపథ్యంలో విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లకు విపరీత డిమాండ్ నెలకొన్నది. క్రికెట్ అభిమానులు రాబోయే వారాల్లో బుకింగ్‌లు -విమాన ఛార్జీలు 20 -50 శాతం మధ్య పెరుగుతాయని, చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.  EaseMyTrip సహ-వ్యవస్థాపకుడు రికాంత్ మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నేపథ్యంలో విమానాలు, హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, ఆతిథ్య నగరం అహ్మదాబాద్‌లో రెసిడెన్సీ సెర్చ్ 1,550 శాతం పెరిగాయి. దుబాయ్‌కి చివరి నిమిషంలో ఇదే విధమైన స్పైక్‌ని మేము అంచనా వేస్తున్నాము.’’ అని తెలిపారు.

దుబాయ్‌లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పటికే రద్దీని ఎదుర్కొంటుంది. డీరా, డౌన్‌టౌన్, దుబాయ్ మెరీనా సమీపంలోని హోటళ్లు అధిక ఆక్యుపెన్సీ రేట్‌లు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. గరిష్ట డిమాండ్ మ్యాచ్ రోజుకి దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ హోటల్‌ల బుకింగ్ లు త్వరగా పూర్తవుతున్నాయని.. పామ్ జుమేరా, షేక్ జాయెద్ రోడ్‌లోని లగ్జరీ ప్రాపర్టీలు ప్రీమియం బుకింగ్‌లలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఛార్జీలు, హోటళ్లు వేగంగా పూర్తి అవుతుండటంతో ట్రావెల్ కంపెనీలు అభిమానులను ఆలస్యంగా కాకుండా త్వరగా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com