ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్..లాయర్ పై కేసు నమోదు..!!

- February 02, 2025 , by Maagulf
ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్..లాయర్ పై కేసు నమోదు..!!

మనామా: బహ్రెయిన్ లో ఓ ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లాయర్.. ఈ వారం లోయర్ క్రిమినల్ కోర్ట్ ముందు హాజరు కానున్నారు.  సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరువు నష్టం కలిగించారని పార్లమెంటు సభ్యుని (ఎంపీ) పరువు నష్టం దావా వేశారు.  ఈ కేసుకు సంబంధించి సదరు సోషల్ మీడియోలో పోస్ట్ వీడియోను సాక్ష్యంగా సమర్పించారు.  ద్వంద్వ పౌరసత్వం కారణంగా మాజీ ఎంపీ మహ్మద్ అల్ హుస్సేనీ తన సీటును కోల్పోయిన తర్వాత గత ఏడాది ముహరక్ గవర్నరేట్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అబ్దుల్‌వాహిద్ ఖరాతా విజయం సాధించారు.

దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను ముగించింది. ఈ విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఎంపీ నుండి అధికారికంగా స్టేట్ మెంట్ రికార్డు చేశారు.   ప్రాసిక్యూషన్ వివాదం మధ్యలో ఉన్న వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా సమీక్షించింది. దాని కంటెంట్‌ను చట్టవిరుద్ధమైన అంశాలను విశ్లేషించింది. సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయవాదిని విచారణ కోసం దిగువ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com