కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్

- February 03, 2025 , by Maagulf
కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కున్న చిత్రం క‌న్న‌ప్ప‌.ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్, న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్ లాల్‌, శ‌ర‌త్ కుమార్‌, మోహ‌న్ బాబు, మ‌ధుబాల..ఇలా ఎంతో మంది స్టార్ న‌టీన‌టులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.అందులో భాగంగా ఈ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ న‌టీన‌టుల పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది.మంచు విష్ణు, మోహ‌న్ బాబు, కాజ‌ల్ అగ‌ర్వాల్, శ‌ర‌త్ కుమార్, అక్ష‌ర్ కుమార్‌ ఇలా అంద‌రి పాత్ర‌ల పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పోస్ట‌ర్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.ఈ చిత్రంలో ప్ర‌భాస్ రుద్రుడిగా క‌నిపించ‌నున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com