జొన్న రొట్టే తింటే బాడీలో ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా?

- February 03, 2025 , by Maagulf
జొన్న రొట్టే తింటే బాడీలో ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా?

జొన్నల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి.అన్నం బదులు రోటీ తీసుకోవాలనుకునేవారు గోధుమ చపాతీలు తింటారు. అయితే, ఇందులో ఎంతో కొంత గ్లూటెన్ ఉంటుంది.ఇది కొంత మందికి పడదు. అందుకే, గ్లూటెన్ ఫ్రీ కోసం జొన్న రొట్టె బెస్ట్ ఆప్షన్. అంతేకాదు, ఇందులో ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్‌లు ఎక్కువగా ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల ఎన్నెన్నో లాభాలు ఉంటాయి.

జొన్న రొట్టె చేయడం కాస్తా ట్రికీ అయినప్పటికీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌తో వీటిని ఈజీగా చేయొచ్చు. ఓ సారి ఈ రొట్టెలకి అలవాటు పడితే మిగతా రొట్టెల బదులు వీటినే తింటారు. అయినా ఇంతలా చెబుతున్నారు.. ఈ రొట్టెల్ని తినడం వల్ల కలిగే లాభాలేంటి అంటే మాత్రం ఈ వివరాలన్నీ తెలుసుకోవాల్సిందే.

జొన్నల్లో మినరల్స్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన రోజువారీ అవసరాలకి హెల్ప్ అవుతాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే పోషకాలన్నీ మనకి అందుతాయి. జొన్న రొట్టెల్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని టాక్సిన్స్ దూరం చేస్తాయి. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

జొన్నల్లో కాల్షియం, పాస్ఫరస్‌లు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల ఎముకలకి బలం.వయసు వల్ల వచ్చే ఎముకలకి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.అదే విధంగా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌ని దూరం చేసి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది.ఇందులోని కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని పెంచుతాయి.

జొన్న రొట్టెల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, జీర్ణ సమస్యలు రావు.మలబద్ధకం, అజీర్ణం ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది.దీంతో బౌల్ మూమెంట్స్ సరిగా ఉంటాయి.

జొన్నల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. పొటాషియం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని తింటే కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి అవ్వదు. దీంతో ఎక్కువగా తినం బరువు కూడా కంట్రోల్ అవుతుంది. తింటూనే బరువు తగ్గాలనుకునేవారికి ఈ జొన్నరొట్టెలు బెస్ట్ ఆప్షన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com