ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..

- February 03, 2025 , by Maagulf
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. యూఏఈ మ్యాచ్ టిక్కెట్ల సేల్స్ ప్రారంభం..

యూఏఈ: ఐసిసి పురుషుల చాంపియన్స్ ట్రోఫీ 2025 మూడు-గ్రూప్ స్టేజ్ ఇండియా మ్యాచ్ లు, దుబాయ్ లో జరుగుతున్న సెమీ-ఫైనల్ 1 టిక్కెట్ల విక్రయాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనరల్ స్టాండ్ టిక్కెట్ ధరలు 125 దిర్హామ్ల నుండి ప్రారంభమవుతాయి.ఆన్లైన్లో (https://www.iccchampionstrophy.com/tickets) టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న 10 మ్యాచ్ ల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇక ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (మార్చి 9) టిక్కెట్లు దుబాయ్ లో మొదటి సెమీ-ఫైనల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు 19 రోజుల్లో 15 మ్యాచ్ లు ఆడతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com