శ్రీనగర్‌లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో..
- July 01, 2016
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొని తమ ఉపవాసాన్ని విరమించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. లౌడ్‌బీటిల్.ఇన్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. గత ఏడాది ఇదే సంస్థ ప్రఖ్యాత దాల్ సరస్సు తీరాన ఆసియాలోనే అతి పెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసింది.
ప్రత్యేకించి అతిథులుగా ఎవరినీ పిలవకుండా అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. దాంతో అన్ని వర్గాలకు చెందిన ముస్లిం సోదరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పళ్ల రసాలు, ఖర్జూరాలు, రకరకాల స్వీట్లతో ఉపవాసాలు చేసేవారికి తగిన మెనూతో ఈ విందును ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపారస్తులు అంతా కలిసి దీనిని స్పాన్సర్ చేశారు.గత ఏడాది ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఏడువేల మందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అతి పెద్ద విందుగా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. కాశ్మీర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున జరిగిన విందులో 3500 మందికి పైగా పాల్గొనడంతో ఆసియాలో అతి పెద్ద విందుగా పేరొందింది.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







