BRS: పార్టీ విప్‌లుగా కె.పి.వివేకానంద, సత్యవతి రాథోడ్
- February 04, 2025
హైదరాబాద్: శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి.వివేకానంద గౌడ్, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను నియమించారు. కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి.రామారావు, పార్టీ ఇతర నేతలు సభాపతికి తెలియజేశారు.
ఈ మేరకు నియామక పత్రాలను సభాపతికి అందజేశారు. కె.పి.వివేకానంద గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







