తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
- February 04, 2025
న్యూ ఢిల్లీ: ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటి వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో 26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) ను ఈ నెల 4 నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో ఆపబోతున్నారు. అలాగే నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17232) ను కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో నిన్నటి నుంచి ఆపుతున్నారు. హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5నుంచి ఆపనున్నారు. అలాగే ఎర్నాకుళం-పాట్నా ఎక్స్ ప్రెస్ (22669)ను ఈ నెల 5 నుంచి ఖమ్మంలో ఆపబోతున్నారు. బీదర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (17009)ని మర్పల్లిలో ఇవాళ్టి నుంచి హాల్ట్ ఇస్తున్నారు.
అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (23655)ను నిన్నటి నుంచి పెద్దపల్లిలో ఆపుతున్నారు. అలాగే సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (10705) రైళ్లను ఇవాళ్టి నుంచి నెక్కొండలో ఆపుతున్నారు. చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) రైలుకు ఈ నెల 8 నుంచి వరంగల్ లో హాల్ట్ ఇచ్చారు. అలాగే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలుకు నిన్నటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో స్టాపులు ఇచ్చారు. అటు తిరుపతి-లింగంపల్లి (12733) రైలును నిన్నటి నుంచి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో ఆపుతున్నారు.అలాగే నరసాపురం-లింగంపల్లి (17255) రైలును నిన్నటి నుంచి నల్గొండలో ఆపుతున్నారు. లింగంపల్లి-నరసాపూర్ (17256) రైలును నిన్నటి నుంచి మంగళగిరిలో ఆపుతున్నారు. పూరీ-తిరుపతి (17479), బిలాస్ పూర్ -తిరుపతి(17481), తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైళ్లను నిన్నటి నుంచి చిన్న గంజాంలో ఆపుతున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







