తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
- February 04, 2025
హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సయ్యద్ మీర్ మొహమద్ అలీ అని. వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సెక్రటేరియట్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి లంగర్ హౌస్ లోని దర్గా గురించి ఫిర్యాదు చేశారనీ. అందుకే తాను సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని ఈ యువకుడు బెదిరించినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇతడ్ని దారుసలాం దర్గా దగ్గర పట్టుకున్నారు TGSPF పోలీసులు.. ఇతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







