మస్క్ టీంలో ఆకాశ్ బొబ్బ..
- February 04, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖలో తాజాగా ఆరుగురు యంగ్ ఇంజనీర్లను నియమించుకున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన యువకుడు కూడా ఉండడంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.
డోజ్ శాఖను ట్రంప్ అమెరికా అనవసర ఖర్చులను తగ్గించడంతో పాటు గవర్నమెంట్ సిస్టమ్‌లో మార్పుల కోసం ఏర్పాటు చేశారు.ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఆయన టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఇచ్చారు. తాజాగా డోజ్ శాఖ 19-24 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆరుగురు ఇంజనీర్లను నియమించుకుంది.
వారిలో ఇప్పటికీ చదువును కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. యూఎస్ సర్కారుకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు డోజ్‌కు అనుమతి ఉంటుంది. అటువంటి కీలక శాఖలో ఇంత తక్కువ వయసున్న వారికి ఉద్యోగులుగా తీసుకోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.
డోజ్ శాఖలో ఆకాశ్ బొబ్బ ఉండడంతో అతడు ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్న వివరాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆకాశ్ బొబ్బ 22 ఏళ్ల యంగ్ ఇంజనీర్. అతను యూసీ బర్కిలీలో మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టెక్నాలజీలో విద్యనభ్యసించారు. అలాగే, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్, మెటాలాంటి సంస్థల్లోనూ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్ పద్ధతుల గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించారు.
ఆకాశ్‌తో పాటు వీరికీ డోజ్‌లో ఉద్యోగం
- ఎడ్వర్డ్ కొరిస్టీన్
- ల్యూక్ ఫారిటర్
- గౌటియర్ కోల్ కిలియాన్
- గావిన్ క్లిగెర్
- ఇథాన్ షావోత్రన్
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







