ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- February 06, 2025
అమరావతి: మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యం కుంభకోణంపై సీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీట్ అధిపతిగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును అధికారులు నియమించారు.
సిట్‌లో ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్. శ్రీహరి బాబు, డీఎస్పీ పి.శ్రీనివాస్ నియామితులయ్యారు. సీఐలు కే. శివాజీ, సీహెచ్.నాగ శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదనలు పంపారు. డీజీపీ ప్రతిపాదనలు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి 15రోజులకు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







