లేబర్ డిస్పూట్.. మాజీ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌కు BD2,600..!!
- February 06, 2025
మనామా: లేబర్ డిస్పూట్ లో ఒక మాజీ జనరల్ మేనేజర్ విజయం సాధించారు. తనకు వేతన బకాయి ఉన్న తన మాజీ రెస్టారెంట్ యజమానిపై దావా వేసి పరిహారం పొందారు. బ్యాక్ పే, పరిహారం, వడ్డీతో సహా మొత్తం BD2,666.67ను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జనరల్ మేనేజర్ తరపు న్యాయవాది అలీ అల్ కస్సీర్ ప్రకారం.. తన క్లయింట్ కు హోటల్ యజమాని BD2,800 వేతన బకాయి చెల్లించలేదు. పైగా అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అనేకసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పరిహారం, వార్షిక సెలవు భత్యం, నోటీసు చెల్లింపు, ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రద్దుకు పరిహారం ,విమాన టిక్కెట్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశారు. "ముందస్తు నోటీసు లేదా బకాయిలు చెల్లించకుండానే అతని ఉద్యోగం ఆకస్మికంగా రద్దు చేయబడటానికి ముందు నా క్లయింట్ BD400 నెలవారీ జీతంతో రెస్టారెంట్‌లో ఎనిమిది నెలలు పనిచేశాడు" అని లాయర్ లేబర్ కోర్టు ముందు వాదించారు. అయితే, హోటల్ యజమాని ఈ వాదనలను ఖండించారు. అతను రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడని.. ద్దె, విద్యుత్, సిబ్బంది జీతాలు, మెటీరియల్‌లు, పరికరాలు చెల్లింకుండా ఆ మొత్తాలను తన ఖాతాల్లో వేసుకున్నాడని ఆరోపించాడు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







