'గాజా ట్రంప్ ఎస్టేట్ కాదు'.. యూఏఈలోని పాలస్తీనియన్లు ఫైర్..!!

- February 06, 2025 , by Maagulf
\'గాజా ట్రంప్ ఎస్టేట్ కాదు\'.. యూఏఈలోని పాలస్తీనియన్లు ఫైర్..!!

యూఏఈ: యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్‌ను తమ దేశం స్వాధీనం చేసుకుంటుందని, పాలస్తీనియన్లు వేరే చోట పునరావాసం పొందిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను యూఏఈలోని పాలస్తీనా ప్రవాసులు తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తమ భూమిని "రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్"గా పరిగణించరాదని వారు అన్నారు.  దుబాయ్ నివాసి, మీడియా ప్రాక్టీషనర్ సల్మా.. గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ ఏదైనా రాజకీయ సంక్షోభం నుండి ప్రయోజనం పొందగల మార్గం గురించి తరచుగా ఆలోచిస్తారని మండిపడ్డారు. దుబాయ్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ఇంజనీర్ అహ్మద్ ఈ ప్రణాళికతో తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ట్రంప్ మన చరిత్రను తుడిచిపెట్టి, మనల్ని బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మేము ఇప్పటికే నిరాశ్రయులం అయ్యామని, ఇప్పుడు అతను మనకు మిగిలి ఉన్న కొద్దిపాటిని ఆశ్రయాన్ని తీసేయాలని కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు.        

యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించడానికి, స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడమే పరిష్కారమన్నారు. పాలస్తీనియన్ల అన్యాయమైన హక్కులపై ఏదైనా ఉల్లంఘనను, యూఎస్ ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com