సైక్లింగ్ విప్లవం..తొలిరేసుకు నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్ సిద్ధం..!!

- February 07, 2025 , by Maagulf
సైక్లింగ్ విప్లవం..తొలిరేసుకు నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్ సిద్ధం..!!

మనామా: నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్.. బహ్రెయిన్ లో అత్యంత పొడవైన, అధునాతనమైన సైక్లింగ్ ట్రాక్. దీనిపై మొదటి ప్రధాన ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ట్రాక్ లో అబ్దుల్ హకీమ్ అల్ షమ్మరీ గ్రూప్ హోల్డింగ్ సైక్లింగ్ రేస్ ఐదవ ఎడిషన్ ను నిర్వహించనున్నారు.    సర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్.. వ్యూహాత్మకంగా సదరన్ గవర్నరేట్‌లో ఉంది. దీనిని 50 కిలోమీటర్లు మేర, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా విజన్ కు కట్టుబడి క్రీడలను ఒక జీవనశైలిగా ప్రోత్సహించడంలో బహ్రెయిన్ నిబద్ధతకు తెలియజేసేందుకు సిద్ధమవుతుంది.

ఇప్పటికే అంతర్జాతీయ సైక్లిస్ట్‌లు కింగ్‌డమ్ ప్రీమియర్ సైక్లింగ్ ఈవెంట్‌ కోసం తరలివచ్చారు. బహ్రెయిన్ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించబడిన అబ్దుల్ హకీమ్ అల్ షమ్మరీ గ్రూప్ హోల్డింగ్ సైక్లింగ్ రేస్ లో బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా 20కి పైగా దేశాల నుండి పాల్గొంటున్నారు.  వారందరూ తొమ్మిది వేర్వేరు కేటగిరీలలో పోటీ పడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com