శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు–స్పెషల్ బస్సులు

- February 07, 2025 , by Maagulf
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు–స్పెషల్ బస్సులు

శ్రీశైలం: మహా శివరాత్రికి శ్రీశైలం సిద్దం అవుతోంది.ప్రతీ ఏటా శివరాత్రి వేళ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఏడాది సైతం ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్య లో భక్తులు తరలి వస్తారనే అంచనాలతో ఏర్పాట్ల పైన అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఇక, తెలంగాణ టూరిజం శ్రీశైలం సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది.ఈ నెల 26న మహా శివరాత్రి. ప్రముఖ క్షేత్ర శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మహా శివరాత్రి బ్రహ్మో త్సవాలు ప్రారంభం కానున్నాయి.పెద్ద సంఖ్యలో భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి తరలి రానున్నారు.దీంతో, భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక..తెలంగాణ టూరిజం శాఖ తాజాగా శ్రీశైలం వంటి ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది.రెండు రోజుల పాటు సాగే యాత్ర కోసం పెద్దలకు రూ 2,999 తో, అదే విధంగా పెద్దలకు రూ 2,392 విలువ చేసే ప్యాకేజీలను వెల్లడించింది.శ్రీశైలం యాత్ర ప్రత్యేకంగా రెండు బస్సులను కేటాయించారు. వాటిలో ఒక ఏసీ బస్సు కూడా ఉంది.నాన్-ఏసీ బస్సు ప్యాకేజీ ధరలను ప్రకటించారు.

నాన్ ఏసీలో పెద్దలకు రూ 2 వేలు, పిల్లలకు రూ 1,600 గా ఖరారు చేసారు. రెండు రోజులు వసతి సౌకర్యం కల్పించారు.ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుండి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.టూర్ లో భాగంగా మధ్యలో సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. వారిని నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు.శ్రీశైల దర్శనం రెండవ రోజు సాయంత్రం లేదా తెల్లవారుజామున చేసుకునే విధంగా ప్లాన్ చేసారు. రోప్‌వే (పాతాళ-గంగా), ఫలధార, పంచధార, శిఖర, చివరకు ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఆనకట్టను సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com