ప్యాసింజర్ పై లైంగిక వేధింపులు..డ్రైవర్‌కు 1 ఏడాది జైలుశిక్ష, బహిష్కరణ..!!

- February 09, 2025 , by Maagulf
ప్యాసింజర్ పై లైంగిక వేధింపులు..డ్రైవర్‌కు 1 ఏడాది జైలుశిక్ష, బహిష్కరణ..!!

దుబాయ్:దుబాయ్ లగ్జరీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఒక డ్రైవర్ మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఘటన గత సంవత్సరం ఏప్రిల్ లో జరిగింది. దుబాయ్‌లోని ఒక యూరోపియన్ నివాసి బిజినెస్ బేలోని ఒక హోటల్ నుండి ఇంటికి రైడ్ బుక్ చేసుకున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ క్రిమినల్ కోర్టు రికార్డులు ప్రకారం.. నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి బదులుగా, ఆ ఆసియా డ్రైవర్ తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతం వైపు మళ్ళించి, అక్కడ ప్రయాణీకురాలిపై దాడి చేశాడు. ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలను అనుసరించి కోర్టు తీర్పును వెలువరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com