ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

- February 09, 2025 , by Maagulf
ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

కటక్: ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రోహిత్ శ‌ర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 305 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మ‌న్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా అక్ష‌ర్ పటేల్(41 నాటౌట్‌), శ్రేయ‌స్ అయ్య‌ర్ (44) లు రాణించారు. విరాట్ కోహ్లీ (5) విఫ‌లం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ ర‌షీద్‌, లియామ్ లివింగ్ స్టోన్‌, గుస్ అట్కిన్సన్‌ త‌లా ఓ వికెట్ సాధించారు.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు శుభారంభం ఇచ్చారు. చాలా కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. 30 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. హాఫ్ సెంచ‌రీ త‌రువాత కూడా అదే దూకుడును కొన‌సాగించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com