ప్రయాణికుడి పొరబాటుతో 25,000 దిర్హామ్‌ల నగదు బ్యాగ్‌ మిస్..!!

- February 10, 2025 , by Maagulf
ప్రయాణికుడి పొరబాటుతో 25,000 దిర్హామ్‌ల నగదు బ్యాగ్‌ మిస్..!!

యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 25,000 దిర్హామ్‌లకు పైగా నగదు ఉన్న ప్రయాణికుడి పోగొట్టుకున్న బ్యాగ్‌ను దుబాయ్ పోలీసులు వెంటనే ట్రాక్ చేసి తిరిగి అందించారని అథారిటీ తెలిపింది. మునీర్ సయీద్ ఇబ్రహీం అనే ఈజిప్షియన్ యాత్రికుడు పొరపాటున మరొక ప్రయాణికుడు తన బ్యాగ్ మాదిరగానే ఉన్న మరో ప్రయాణికుడి బ్యాగును కన్వేయర్ బెల్ట్ వద్ద నుండి తీసుకెళ్ళాడు.అయితే, అందులో ఉండాల్సిన  ప్రయాణ పత్రాలతో పాటు $7,000 (సుమారు 25,710.30 దిర్హామ్‌లు) నగదు కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. జరిగిన పొరబాటును గుర్తించాడు. వెంటనే పోలీసులను కలిసి జరిగిన పొరబాటును వివరించాడు.  దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అరగంటలో అతని బ్యాగుని ట్రాక్ చేసి తిరిగి ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

కేవలం ఒక గంటలో చైనాకు మరో విమానాన్ని పట్టుకోవాలనే హడావిడిలో మునీర్ తన బ్యాగును పోలిఉన్న మరో బ్యాగును తీసుకున్నాడని, వెంటనే పొరబాటును గ్రహించి అరైవల్ హాల్‌లోని విమానాశ్రయ పోలీసు కార్యాలయానికి వెళ్లడంతో అతనికి వెంటనే న్యాయం చేసేందుకు వీలయిందని తెలిపారు.   ఆ తర్వాత మునీర్ చైనాకు వెళ్లే విమానాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దుబాయ్ పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కృషికి.. వారు వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రయాణీకులు అభినందించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com